కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి మృతి

Wed,December 12, 2018 08:55 PM

father died with heart attack after his son death

నల్గొండ: కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి కూడా మృతి చెందిన ఘటన జిల్లాలోని కనగల్ మండలంలోని జి. యడవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయపల్లి వెంకన్న గీతకార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి మృతిచెందాడు. కొడుకు మృతిని తట్టుకోలేని అతడి తండ్రి ముత్తయ్య(70) తీవ్రమైన దిగులుతో మంచంపట్టాడు. బుధవారం తెల్లవారుజామున గుండెపొటు రావడంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు వారం రోజుల వ్యవధిలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

5366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles