చిన్నారి మృతికి కారణమైన తండ్రికి రిమాండ్

Mon,May 21, 2018 08:50 AM

father arrested in Daughter murder case

చేగుంట: చిన్నారి నందిని మృతికి కారణమైన తండ్రిని చేగుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చేగుంట పోలీస్‌స్టేషన్‌లో రామాయంపేట సీఐ వెంకట్‌రెడ్డి నిందితుడి వివరాలు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి...చేగుంట మండ లం చెట్లతిమ్మాయిపల్లి పులిగుట్ట తండాకు చెందిన కెతవత్ భాస్కర్‌కు నర్సపూర్ నాగోల్‌గుట్ట తండాకు చెందిన ప్రమీల బిక్యాల కుతూరు పద్మతో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కాగా మొదటి సంతానం ఆడ బిడ్డ పుట్టడంతో పాటు 10నెల్లల క్రితం రెండో కూతురు నందినికి జన్మించింది.

మళ్లీ ఆడపిల్ల పుట్టింది చంపివేస్తానని నందిని పుట్టిన నాటి నుంచి తండ్రి భాస్కర్ మద్యం సేవించి భార్యతో తరచూ గొడవ పడుతూ కొట్టేవాడని ఈక్రమంలో ఈనెల15వ తేదీన మధ్యాహ్నం తాగివచ్చి భార్యతో గొడవ పెట్టుకొని కింద పడవేశాడు తల్లీ ఒడిలో ఉన్న నందినిని లాగుకొని తలపై బలంగా కొట్టడంతో చిన్నారి నందిని స్పృహ కొలుపోయి తలకు బలమైన గాయాలు అయ్యాయి. అది గమనించిన భాస్కర్ తమ్ముడు శంకర్ చిన్నారిని తూప్రాన్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి కొంపల్లిలోని రశ్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈనెల 18న రా త్రి నందిని మృతి చెందింది.

కూతురును కొట్టిన విషయం బయటకు తెలిస్తే నిన్ను నీ మొదటి కుతూరును చంపివేస్తానన్ని బెదిరించడంతో బయటకు చెప్పలేదని, చిన్నారిమృతి చెందిన విషయాన్ని తల్లీ పద్మ జీర్ణించుకోలేక తన తల్లిదండ్రుల సహయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా పాప మృతికి కారణం నేనే అని భాస్కర్ ఒప్పుకున్నాడు. ఈ మేరకు చిన్నారి తల్లీ పద్మ ఫిర్యాదు మేరకు కేసు సమోదుచేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ సత్యనారాయణ,పోలీసు సిబ్బంది ఉన్నారు.

1883
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS