కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రైతాంగానికి ఎంతో మేలు

Mon,May 20, 2019 10:59 PM

farmers will get more benefit with kaleshwaram project says ap highcourt retired chief justice

* సీఎం కేసీఆర్ కృషి అభినందనీయం
* ఏపీ హైకోర్టు రిటైర్డు చీఫ్ జస్టిస్ వి.ఈశ్వరయ్య

పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఉమ్మడి ఏపీ రిటైర్డు చీఫ్ జస్టిస్ వీ ఈశ్వరయ్య అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుబంధంగా నిర్మించిన జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం శివారులోని 6వ ప్యాకేజీ అండర్ టన్నెల్‌ను ఈశ్వరయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. భూగర్భంలో నిర్మించిన సర్జ్‌పూల్, పంప్‌హౌస్, జీఐఎస్ సబ్ స్టేషన్‌ను, టన్నెల్‌కు బయట నిర్మించిన నీటిని పంపింగ్ చేసే డెలివరీ సిస్టర్న్‌లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇక్కడ నిర్మితమైన నిర్మాణాల గురించి ఈఈ నూనె శ్రీధర్ రిటైర్డు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్యకు సమగ్రంగా వివరించారు. సర్జిఫూల్ విశిష్టత గురించి వివరించారు. అనంతరం రిటైర్డు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతో కీలకం అయిందని అన్నారు. సుమారు 40 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి రూపకల్పన చేయడం ఎంతో అభినందనీయం అని అన్నారు. గతంలో ఉన్న ప్రణాళిక కాకుంగా సీఎం కేసీఆర్ స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రీడిజైనింగ్ చేయటం దానికి అనుగుణంగా పనులు వేగవంతంగా జరగటం ఎంతో ప్రశంసనీయమని ఈశ్వరయ్య కొనియాడారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రైతులకు సాగు నీటి ఇబ్బందులు తొలగిపోవటంతో మంచి పంట దిగుబడులు వచ్చి వారు ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయని ఆయన వివరించారు. 6వ ప్యాకేజీలో మోటార్ల వెట్ రన్ పూర్తి చేసుకోవటం మంచి శుభపరిణామం అని ఆయన పేర్కొన్నారు.

725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles