‘మద్దతు ధర రాకపోతే.. కొనుగోలు బాధ్యత కమిటీలదే’

Tue,September 12, 2017 06:16 PM

Farmers coordination committees will buy the crop says Minister Eetela rajender

పెద్దపల్లి: పండించిన పంటకు మద్దతు ధర రాకపోతే రైతుల నుంచి రైతు సమన్వయ కమిటీలే పంటను కొనుగోలు చేస్తాయని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో నేడు రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, నారదాసు, జెడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ
హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. గతంలో కరెంట్ సరిగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డరన్నారు. సబ్‌స్టేషన్లపై దాడులు సైతం చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు, విత్తనాల కోసం రైతులు క్యూలు కట్టే పరిస్థితి లేదన్నారు. పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే స్థితికి రావాలన్నారు. రైతు సమన్వయ సమితిలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రైతులంతా అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ. 8 వేలు పెట్టుబడిగా అందిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణాలు మాఫీ చేసినట్లు పేర్కొన్నారు.

1085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles