లక్ష్యాన్ని ఎంచుకోండి..గమ్యాన్ని చేరండి: హరీశ్ రావు

Tue,January 1, 2019 12:10 AM

farmer minister harish rao new year celebration in welfare hostel

సిద్దిపేట: సంక్షేమ హాస్టల్ లో మాజీ మంత్రి హరీశ్ రావు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విద్యార్థుల మధ్య వేడుకలు జరుపుకోవడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మిలో ఒకడిగా.. నాకుటుంబ సభ్యులుగా భావించి మీ దగ్గరికి వచ్చాను. ఇది 14 వ సంవత్సరం ఈ హాస్టల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం. ఆరోజు వాళ్ళ కష్టాలను కళ్లారా చూసాను. కొద్ది కొద్దిగా హాస్టల్ ను భాగు చేసుకున్నాం. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు. పూర్వ విద్యార్ధుల నుంచి ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఇన్స్పిరేషన్ పొందాలి. సిద్దిపేట లో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాం. నా నెల జీతం మీకు ఇస్తా, కావాల్సిన కంప్యూటర్లు తెచ్చుకోండి. దేశంలోనే సన్న బియ్యం తో అన్నం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు 40 లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. పట్టుదలతో చదివితే ఏదైనా సాధించగలం. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకోండి. మీ తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తెలంగాణ నేల గర్వపడేలా చదవాలి. మీకు ఉద్యోగాలు వస్తే కుటుంబ సభ్యుడిలా గర్విస్తా. ప్రతి సంవత్సరం కుటుంబంతో గడపకున్నా మీతో గడుపుతా. కేసీఆర్ తెలంగాణ సాధించే క్రమంలో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో పని చేసారు. అదే పట్టుదలతో నేను లక్ష మెజారిటీ సాధించాను.
2019 సంవత్సరం మీ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాని తెలిపారు.

1371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles