విద్యుదాఘాతానికి రైతు బలి

Sun,July 21, 2019 09:01 PM

farmer died with current shock in mancherial bheemaram

భీమారం : కరెంట్ ఓ రైతు నిండు ప్రాణం తీసుకుంది. పత్తి చేనుకు మందు కొడ్తామని వెళ్లి అక్కడ పనిలో భాగంగా ఫెన్సింగ్ కేబుల్‌కు ఉన్న జే వైరును తీసుకుందామని దానిని ముట్టుకోవడంతో విద్యుత్ షాక్ కొట్టి బొమ్మరాపు మొండయ్య(60) అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఎల్కేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్‌బీపేట్(లాల్‌బహదూర్‌పేట) గ్రామంలో జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొమ్మరాపు మొండయ్య ఆదివారం ఉదయం పత్తి చేనుకు మందు కొట్టేందుకు వెళ్లాడు. అతడి చేను పక్కనే కొత్తపల్లి సమ్మిరెడ్డి, మహేందర్‌రెడ్డిలకు పొలం ఉండగా అందులోకి తన బర్రెలను మేతకు వదిలేశాడు. తిరిగి సాయంత్రం వస్తున్న క్రమంలో అక్కడున్న ఫెన్సింగ్‌కు ఉన్న జె వైరును తీసుకుందామని ప్రయత్నించగా, తీగకు విద్యుత్ ప్రవహించడంతో మొండయ్యకు షాక్ కొట్టింది. ఇది గమనించిన అతడి భార్య లక్ష్మి అతడిని కాపాడేందుకు ప్రయత్నించగా ఆమె కూడా విద్యుదాఘాతానికి గురి కాగా అక్కడున్న గమనించి ట్రాన్స్‌ఫార్మర్‌ను బంద్ చేశారు. అప్పటికే మొండయ్య మృతిచెందగా, గాయపడిన లక్ష్మిని మంచిర్యాల దవాఖానకు పంపించారు. భీమారం ఏఈ కె.శ్రీనివాస్ పరిశీలించి కొత్తపల్లి సమ్మిరెడ్డి, మహేందర్‌రెడ్డిల పొలంలోకి స్టార్టర్‌కు కనెక్షన్ ఇచ్చిన తీగ ఫెయిల్ అయి ఫెన్సింగ్‌కు తగలడంతో ఫెన్సింగ్‌కు విద్యుత్ ప్రవహించి మొండయ్య చనిపోయినట్లు తెలిపారు.

458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles