నకిలీ ఆర్టీఏ, పోలీస్ ముఠా అరెస్ట్..

Tue,April 9, 2019 09:43 PM

fake rta and police gang arrested

జనగామ : నకిలీ ఆర్టీఏ, పోలీస్ అధికారులమంటూ జాతీయ రహదారులపై రాత్రి సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను జనగామ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ముఠాలో ఏడుగురు వ్యక్తులు ఉండగా అందులో ముగ్గుర్ని పట్టుకున్నామని, కారుతోపాటు మూడు సెల్‌ఫోన్లు, రూ.4900 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. జనగామ సీఐ మల్లేశవయాదవ్ కథనం వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామానికి చెందిన కే ప్రశాంత్, వో రమేశ్, వీ బాలకృష్ణ, వీ వేణు, సీ కర్ణాకర్, బీ రాజశేఖర్, టీ జోసఫ్ ముఠా ఏర్పడ్డారు. కొద్ది రోజులుగా ఆర్టీఏ, పోలీస్ అధికారులమని చెబుతూ రాత్రి వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలు, ట్రాక్టర్లను ఆపి, ఓనర్లు, డ్రైవర్లను బెదిరింపులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు..

తాజాగా ఈ ముఠా జాతీయ రహదారిలో జనగామ మండలం యశ్వంతపూర్ శివారులో లారీలను ఆపి అక్రమ వసూళ్లకు పాల్పడుతుండడంతో ఆ మార్గంలో ఇసుక లారీలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలను నిలుపుతున్న యువకులు మద్యం సేవించి ఉండడంతో వారిని అనుమానించిన శ్రీనివాస్ అనే ఓ లారీ డ్రైవర్ వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు ముఠా సభ్యులు తప్పించుకోకుండా ఉండేలా వెంటనే పక్కనున్న రఘునాథపల్లి పోలీసులను అప్రమత్తం చేసి జిల్లా కేంద్రమైన జనగామ నుంచి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రఘునాథపల్లి, జనగామ పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి ముఠాలోకి కే ప్రశాంత్, వో రమేశ్, వీ బాలకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, మూడు సెల్‌ఫోన్లు, రూ. 4900 నగదును స్వాధీనం చేసుకుని ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న నలుగురి కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, వారిని త్వరలో పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

1475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles