వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసులు అరెస్ట్‌

Tue,April 9, 2019 12:20 PM

fake police arrested by police at Janagama

జనగామ : జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై ఇసుక లారీల వద్ద అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీఏ పోలీసు అధికారులుగా చెప్పుకొని వసూళ్లు చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాలో.. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు నకిలీ పోలీసులు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన ముగ్గురి నుంచి ఒక కారు, మూడు సెల్‌ఫోన్లు, రూ.2,600 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles