ట్రాఫిక్ చలాన్‌ల నుంచి తప్పించుకునేందుకు జిమ్మిక్కులు

Fri,July 12, 2019 08:22 AM

fake numbers escape traffic challans

హైదరాబాద్ : ట్రాఫిక్ చలాన్‌ల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. ఇలాం టివారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నంబర్ల ప్లేట్లను వంకర టింకరగా చేయడం, సీరిస్‌లో ఒక నంబర్‌ను తొలగించడం , వాహనానికి ముందు ఒక్క నంబర్, వెనకాల మరో నంబర్ పెట్టుకుని తిరుగుతున్న వారిపై పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాహనదారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో నలుగురు వాహనదారులు నెంబర్ ప్లేట్‌పై నంబర్లను మార్చేసిన వై నాన్ని గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఎస్‌ఐ లఖన్ రాజ్ ఉదయం జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు వాహనాలపై ఉన్న నంబర్, రిజిస్ట్రేషన్ పత్రాల్లోని నంబర్ వేరువేరుగా ఉండగా, ఆ వాహనాల నంబర్ ప్లేట్లను వంచేసినట్లు గుర్తించారు వెంటనే ఎస్‌ఐ వాహనదారులైన విజయ్, కృష్ణ, రామాంజన్, హరీష్‌లపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఈ నలుగురు వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

15706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles