నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

Fri,November 22, 2019 10:42 PM

మహబూబాబాద్ : నకిలీ నోట్లు ముద్రిస్తూ చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాట చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన సామల శ్రీనివాస్ కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ అతడే ముద్రించిన నకిలీ రూ. 2000, రూ.500, రూ.200 నోట్లు చెలామణి చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిరాయి ఇంట్లో ఉంటూ సినిమా రంగంలో పని చేశాడు. ఎప్పటికైనా సినిమా తీయాలనే దురాషతో యూటూబ్ ద్వారా నకిలీ నోట్ల తయారీని తెలుసుకున్నాడు. కలర్ జిరాక్స్ మిషన్ ద్వారా నకిలీ నోట్లను తయారు చేశాడు.


తన తండ్రి సామల సారంగపాణి, తల్లి భాగ్యలక్ష్మి, తమ్ముళ్లు సాయిచరణ్, అఖిల్‌తో కలిసి ఈ నెల 19వ తేదీన కేసముద్రం మండలంలోని ఉప్పరపెల్లి గ్రామంలోని ఓ కిరాణా, బెల్ట్‌షాపులో వస్తువులు కొనుగోలు చేసి నకిలీ నోట్లను ఇచ్చారు. ఇది గుర్తించిన దుకాణా నిర్వాహకులు కేసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసముద్రం ఎస్సై సతీష్ బృందంతో తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కేసముద్రం మండలం ఇనుగుర్తి క్రాస్‌రోడ్డ వద్ద కోరుకొండపల్లి వైపు వస్తున్న ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా అందులోనుంచి రూ. 69,900 నకిలీ నోట్లు, రూ. 29,870 ఒరిజినల్ నోట్లు స్వాధీనం చేసుకుని, ఐదురుగు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశామన్నారు. సమావేశంలో డీఎస్పీ ఆంగోత్ నరేష్‌కుమార్, రూరల్ సీఐ వెంకటరత్నం పాల్గొన్నారు.

458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles