నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

Mon,April 16, 2018 07:33 PM

fake cotton seeds seized in mancheryal district

మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లిలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని విక్రయించేందుకు తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ బెల్లంపల్లి టూటౌన్ పోలీసేస్టషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

కాకినాడకు చెందిన మెడిశెట్టి గోవింద్ మేడ్చెల్ జిల్లాకు వలస వచ్చి స్థిరపడ్డాడు. ఆర్టీసీకాలనీలో నివాసముంటున్నాడు. నకలీ విత్తనాలు విక్రయించడమే ప్రధాన వృత్తిగా పెట్టుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఫ్లైఓవర్ వద్ద ఎస్‌ఐ వినోద్‌కుమార్, బ్లూకోట్ సిబ్బంది.. వాహనాలు తనిఖీ చేస్తుండగా నకిలీ పత్తి విత్తనాలు తీసుకెళ్తున్న ఆటో ట్రాలీ పట్టుబడింది.

ఇందులో 16 ప్లాస్టిక్ బ్యాగుల్లో నకిలీవిత్తనాలు లభించాయి. వీటి విలువ రూ. నాలుగున్నర లక్షలు ఉంటుందని ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. ఆటోట్రాలీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించగా గోవింద్ పేరు చెప్పాడు. అతడిని ఆటోట్రాలీ డ్రైవర్‌తో బేరం కోసం పిలిపించి అరెస్ట్ చేశారు. అతడి కారు, నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలను ఆసిఫాబాద్‌కు తీసుకెళ్తున్నట్లు అంగీకరించారు. ఈ మేరకు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

1334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS