నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్టు

Wed,June 12, 2019 05:09 PM

fake cotton seed gang arrested in Siddipet district

సిద్దిపేట: నకిలీ పత్తి విత్తనాల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం మాదారంలో చోటుచేసుకుంది. నకిలీ పత్తి విత్తనాల తయారీ, సరఫరా ముఠా సభ్యులను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నట్లు విజిలెన్స్‌ ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు. ఏడుగురిని అరెస్ట్‌ చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.35 లక్షల విలువ చేసే పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నకిలీ విత్తనాల నియంత్రణకు నెల రోజులపాటు తనిఖీలు చేపడతామన్నారు. ఇప్పటి వరకు రూ.53 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles