ఫేస్‌బుక్‌లో పరిచయం.. కిడ్నాప్

Sat,January 26, 2019 07:36 AM

Facebook friendship and kidnapped

హైదరాబాద్ : ఫేస్‌బుక్‌లో హీరో ఫొటో పెట్టి, ఓ బాలికతో పరిచయం పెంచుకొని కిడ్నాప్ చేసిన యువకుడికి ఐదేండ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 52 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువడించిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బూక్య ప్రేమ్ సాయి అలియాస్ సిద్ధూ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో దినేష్‌నాయుడు ఫొటో పెట్టాడు. దినేష్ అప్‌కమింగ్ హీరో కావడంతో ఆ ఫొటో చూసిన ఓ మైనర్ బాలిక అతడితో ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేయడం ప్రారంభించింది. దీనిని ఆసరగా చేసుకొని.. ఆర్థిక సమస్యలున్నాయంటూ ఆ బాలిక వద్ద నుంచి డబ్బు లాగడం ప్రారంభించాడు.

బాలిక వద్ద డబ్బు లేకపోవడంతో తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను విక్రయించి అతడికి డబ్బు ఇస్తూ వచ్చింది. తరుచు డబ్బు అడుగుతుండడంతో తనను మోసం చేస్తున్నాడని అనుమానించి.. దూరంగా ఉంటుంది. తనను పట్టించుకోవడం లేదని గుర్తించిన ప్రేమ్, తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని,కుటుంబ సభ్యులను ఒప్పించి కొంత పొలం అమ్మేయడంతో డబ్బు వచ్చిందంటూ నమ్మించాడు. డబ్బు తన స్వగ్రామంలో ఉన్నాయంటూ నేరుగా కలిసిన తరువాత తనను పెండ్లి చేసుకోవాలంటూ కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కొని, ఆమెను కిడ్నాప్ చేసి బంజారాహిల్స్‌లోని ఒక హోటల్‌లో నిర్భందించాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి ఇన్స్‌పెక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి నేతృత్వంలో నిందితుడిని అరెస్టు చేసి, అనంతరం న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడు బూక్యప్రేమ్‌కు శిక్ష ఖారు చేసిందని సీపీ వెల్లడించారు.

1768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles