పేలుడు పదార్థాలు పట్టివేత



Tue,November 14, 2017 09:20 PM

explosives Capture at Karimnagar

కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడ్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఈ మేరకు కరీంనగర్ అడిషినల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) పీ సంజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు గ్రామంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఇంటింటినీ క్షుణ్నంగా తనిఖీ చేయడంతో గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 170 జిలెటిన్ స్టిక్స్, 125 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. గ్రామంలో మరో ఇద్దరు అనుమానితులనుఅదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను, 3 ఆటోలను, స్థానికంగా తయారు చేస్తున్న సర్ప్, సబ్బులు, గుటాలను స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్‌లో శిక్షణ కలెక్టర్ ప్రావీణ్య, కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి, రూరల్ సీఐ శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

1439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS