మహాకూటమి కాదు.. మహాకుట్ర

Tue,September 25, 2018 12:58 PM

Ex Speaker Suresh Reddy fire on Opposition Parties

నిజామాబాద్ : విపక్షాలది మహాకూటమి కాదు.. మహాకుట్ర అని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే కూటమి కడుతున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాకు పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ అనేక పనులు చేపట్టారని గుర్తు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానని సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న సీఎంకు అండగా నిలవాలనే టీఆర్‌ఎస్‌లో చేరానని ఆయన స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లోనూ సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని సురేశ్ రెడ్డి చెప్పారు.

1954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles