మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు గుండెపోటు

Fri,June 22, 2018 03:08 PM

Ex MLA Gummadi Narsaiah suffers heart attack

భద్రాద్రికొత్తగూడెం : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు ఇవాళ ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గుమ్మడి నర్సయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. సీపీఐ(ఎంఎల్ - న్యూడెమోక్రసీ) పార్టీ నుంచి 1983లో ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుమ్మడి నరసయ్య ఇల్లందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

3999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles