గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతి

Wed,June 12, 2019 11:06 AM

Ex MLA Gattu Bheemudu passes away at NIMS

జోగులాంబ గద్వాల : గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1999లో భీముడు మొదటిసారి గద్వాల నియోజకవర్గం టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. గట్టు భీముడు మృతిపట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles