స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

Sat,January 12, 2019 12:10 PM

Ex Minister Jagadish reddy tributes to Swamy Vivekananda in Suryapeta

సూర్యాపేట : సూర్యాపేటలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో స్వామి వివేకానంద 156వ జయంతి ఉత్సవాలు, జాతీయ యువజన దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని స్వామి వివేకానంద విగ్రహానికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ యువతకు, ప్రపంచానికి వివేకానంద వ్యక్తిత్వం ఆదర్శం కావాలన్నారు. ప్రపంచ సమాజం మొత్తం వివేకానంద మార్గం నడవాలని సూచించారు. భారతీయ విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు వివేకానందుడు అని తెలిపారు. మానవ సమాజం ఉన్నంత వరకు వివేకానందుడి బోధనలు ఈ సమాజానికి ఉపయోగపడుతాయని చెప్పారు. నిరాశ, నిస్పృహలలో ఉన్న ప్రతి ఒక్కరికీ వివేకానంద బోధనలు చైతన్యవంతం చేస్తాయని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజీవ రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ గుండూరి ప్రవళికా ప్రకాశ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ఉప్పల ఆనంద్, కౌన్సిలర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

1091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles