ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి

Fri,January 25, 2019 02:43 PM

Ex Minister Harish Rao attend to National Voters day programme in siddipeta

సిద్దిపేట : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఈవీఎం ఇక్కడ ఏర్పాటు చేసి ఓటరు దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమని హరీశ్ రావు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు వేసి మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందన్నారు. వృద్ధులు, వికలాంగులు కూడా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు హక్కు వినియోగించుకోవాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

1674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles