రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలి: మంత్రి ఎర్రబెల్లి

Wed,September 18, 2019 11:30 AM

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతనిధులందరూ పాల్గొనాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులను ఆదుకున్నాం. చెరువులను బాగు చేసుకున్నాం. కాళేశ్వరంను ఛాలెంజింగ్‌గా పూర్తిచేసుకున్నాం. మిషన్ భగీరథను ఛాలెంజింగ్‌గా పూర్తిచేసుకున్నం. 24 గంటల కరెంటు అసాధ్యం కానిది సాధ్యం చేసి చూపించాం. ఈ రోజు రెండోసారి అధికారం చేపట్టాక గ్రామ సీమలు బాగుచేయాలని ఛాలెంజింగ్‌గా తీసుకుని పెద్దఎత్తున ముందుకు పోతున్నామన్నారు. డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, చెత్త సేకరణ, మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్ కొనిచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నర్సరీలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీలకు అధికారాలు ఇచ్చాం, నిధులు ఇచ్చాం. నిధుల కొరత లేదని మంత్రి పేర్కొన్నారు.

1111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles