ఈసీ నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలి: జితేందర్

Tue,May 21, 2019 06:53 PM

Everyone should follow EC guidelines says additional DG jithender

హైదరాబాద్: ఎన్నికల సంఘం నియామవళిని ప్రతి ఒక్కరు పాటించాలని అదనపు డీజీ జితేందర్ అన్నారు. ఓట్ల లెక్కింపు, భద్రతా ఏర్పాట్లపై మీడియాతో అదనపు డీజీ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 37 కేంద్రాల్లో ఈవీఎంలను భద్రపరిచినట్లు తెలిపారు. కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం నుంచి అబ్జర్వర్లు ఉంటారన్నారు. పాసులు ఉన్న వ్యక్తులు మాత్రమే లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్తారన్నారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ అనుమతి లేదని.. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలు నిషేదమన్న ఆయన అనుమతి తీసుకున్న తరువాతే విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలని సూచించారు. ఒక్కచోట కూడా రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. నిజామాబాద్‌లో కౌంటింగ్‌కు చాలా సమయం పడుతుందని తెలిపారు. నిజామాబాద్ కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

1445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles