రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలి: గవర్నర్

Tue,June 14, 2016 06:55 PM

Everyone should donate blood

హైదరాబాద్: రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహాన్ అన్నారు. రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న సంస్థలు, వ్యక్తులకు గవర్నర్ నేడు రాజ్‌భవన్‌లో అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న సంస్థలు, వ్యక్తులకు అభినందనలు తెలిపారు. రక్తదానానికి అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రతి రక్తపు బొట్టు ఇంకొకరి ప్రాణాలను రక్షిస్తుందని తెలిపారు. రక్తందానం వల్ల ఇంకొకరి ప్రాణాలను నిలబెట్టిన వాళ్లమౌతామన్నారు. రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కోరారు. రక్తదానంపై సమాజంలో మరింత అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డ ఆయన తెలుగు రాష్ర్టాల్లో రెడ్‌క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

1005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles