ఏ సర్వే చూసినా గెలుపు టీఆర్‌ఎస్‌దే: ఎంపీ కవిత

Tue,September 18, 2018 09:21 PM

Every survey tells about TRS party victory in coming elections says mp Kavitha

నిజామాబాద్: స్థానికం నుంచి జాతీయం వరకు ఏ సర్వేలు చూసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీదే విజయమని చెబుతున్నాయని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఈ భేటీకి ఎంపీ కవిత, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఏ సర్వేలు చూసినా టీఆర్‌ఎస్ 100 సీట్లు గెలుస్తుందని చెబుతున్నాయన్నారు. మొట్టమొదటి సీటు బాల్కొండలో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. సమావేశం అనంతరం ఎంపీ కవిత, ప్రశాంత్‌రెడ్డి భీంగల్‌లో పలు గణేష్ మండపాలను సందర్శించారు.

2632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles