ఇ-సువిధ ద్వారా ప్రతి రౌండ్ ఫలితం

Tue,May 21, 2019 06:03 PM

Every round results announced through e- suvidha says ghmc commissioner

హైదరాబాద్: ఇ-సువిధ అనే విధానం ద్వారా ప్రతి రౌండ్ పూర్తికాగానే ఫలితం వెల్లడిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 5.30 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తారన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఒక్కో లెక్కింపు కేంద్రానికి ప్రత్యేక ఇన్‌ఛార్జీలను నియమించినట్లు వెల్లడించారు. ఎన్నికల పరిశీలకులకు మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. మిగతా ఎవ్వరూ లెక్కింపు కేంద్రం లోపలికి సెల్‌ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును ఇద్దరు రిటర్నింగ్ అధికారుల సమక్షంలో చేపట్టనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.

3011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles