పెళ్లి చేసుకోమని వేధించిన యువకుడిపై కేసు నమోదు

Mon,April 23, 2018 07:56 AM

Eve-teaser arrested choutuppal yadadri bhuvanagiri

చౌటుప్పల్ : నిశ్చితార్థం జరిగిన యువతి వెంట పడి పెళ్లి చేసుకోమని వేధిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన మండలంలోని చిన్నకొండూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాండ్ర రాజయ్య కుమార్తె (20)కి సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఉప్పర రఘుటతో ఈనెల 20న నిశ్చితార్థం జరిగింది. అయితే చిన్నకొండూరులోని తన పిన్ని ఇంటికి త రచుగా వచ్చే వలిగొండ మండలం గోకారం గ్రా మానికి చెందిన ఆవనగంటి శ్రీశైలం (24)కు బాధిత యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో గతంలోనే ప్రేమించమని వేధించాడు.

పెద్దమనుషుల నడుమ పంచాయతీ కూడా జరిగింది. ఈ క్రమంలో యువతికి నిశ్చితార్థం జరిగాక కూడా తననే పెండ్లి చేసుకోవాలని వేధించసాగాడు. అందులో భాగంగా పెండ్లి కుమారుడైన రఘు సోదరుడు గణేశ్‌కు గతంలో ఓ వివాహ వేడుకల్లో దిగిన ఫోటోలను వాట్సాప్‌లో పంపా డు. దీంతో వారు వెంటనే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు తెలిపారు. యువతి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీశైలంపై కేసు నమోదు చేసి, యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటయ్య తెలిపారు.

2719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles