అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు: ఈటల

Tue,October 2, 2018 01:17 PM

హైదరాబాద్: ప్రతిపక్షాలు సోషల్‌మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తూ..టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. సోషల్‌మీడియాలో వస్తున్న విషప్రచారాన్ని మంత్రి ఈటల తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి ఈటల మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అభివృద్ధిని అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణను సాధించుకున్నం. తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినం. కరెంటు కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించినం. టీఆర్‌ఎస్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలు పట్టం కట్టిన్రు. కాంట్రాక్ట్ లెక్చరర్లు, హోంగార్డులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్ల జీతాలు పెంచినం. లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించినమని ఈటల అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో కోటి రూపాయల నిధుల కోసం కూడా కొట్లాడాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చినంక వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినం. తెలంగాణలో 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని ఈటల ప్రశ్నించారు.

1096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles