నా వ్యాఖ్యల వక్రీకరణ సరికాదు : మంత్రి ఈటల

Thu,August 29, 2019 09:44 PM

Etela Rajender clarifies on Huzurabad meeting comments

హైదరాబాద్‌ : హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకుడు కాసిపేట శ్రీనివాస్‌ చేరిక సందర్భంగా నేను చేసిన ప్రసంగాన్ని కొన్ని వార్త ఛానళ్లు, సోషల్‌ మీడియా వక్రీకరించాయి. నా వ్యాఖ్యల వక్రీకరణ సరికాదు అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తప్పుడు వార్తలతో అవమానించాలని చూడొద్దు. నిరాధారమైన వార్తలు వద్దు. సోషల్‌ మీడియా సంయమనంతో ఉండాలి. నేను గులాబీ సైనికుడిని. మా నాయకుడు కేసీఆర్‌. నేను పార్టీలో చేరిన నాటి నుంచి నేటి వరకు గులాబీ సైనికుడినే. ఇటీవల కాలంలో కొన్ని వార్తా పత్రికలు(దక్కన్‌ క్రానికల్‌), సోషల్‌ మీడియాలో మా పార్టీ అంటే గిట్టని వాళ్లు, నా ఎదుగుదలను ఓర్వలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

నేను ఒక కులానికి ప్రతినిధిని అన్నట్టు, డబ్బులకు ఆశపడే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికే నేను పది లక్షల కోళ్ల ఫారానికి యజమానినని చెప్పాను. హుజురాబాద్‌ నియోజకవర్గానికి నన్ను పంపించి ఇక్కడ పోటీ చేయించి గెలిపించింది మా నాయకుడు కేసీఆరే. రాజకీయాల్లో సంపాదించుకోవడానికి రాలేదు. నేను పార్టీలో, ఉద్యమంలో చేరే నాటికి పారిశ్రామివేత్తనని చెప్పాను.

ఓ పార్టీ నాయకుడు ఇటీవల పత్రికలో వచ్చిన కథనంపై స్పందించాలని వేదికపై కోరడంతో ఆ పత్రికపై నేను చేసిన కామెంట్లపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆనాడు పార్టీ మారాలని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అనేక రకాలుగా నాపై ఒత్తిడి తెచ్చినా లొంగని వ్యక్తి ఈటెల రాజేందర్‌. ఈ ఉద్యమ పుణ్యాన నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం ఆపాలి. సోషల్‌ మీడియా సంయమనంతో ఉండాలి. నా ప్రసంగ పాఠాన్ని పూర్తిగా చూడండి. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచేది గులాబీ జెండానే. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే అని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

5229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles