ఆరోసారి ఈటల రాజేందర్ విజయ కేతనం

Tue,December 11, 2018 02:30 PM

Etala Rajender wins to Assembly sixth time

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున ఈటల విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికలోనూ గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో హుజురాబాద్ నుంచి విజయాన్ని ముద్దాడారు. అనంతరం 2010లో రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో కూడా గెలుపొందారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఇలా ఇప్పటి వరకు అంటే పదేండ్లలో అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఈటల రాజేందర్ మరోసారి విజయం సాధించి.. అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.

2117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles