మరోసారి మంత్రిగా ఈటల రాజేందర్..

Tue,February 19, 2019 12:03 PM

Etala Rajender take Oath as Minister at Rajbhavan

పూర్తి పేరు : ఈటల రాజేందర్‌
పుట్టిన తేది : 24-03-1964
తల్లిదండ్రులు : ఈటల వెంకటమ్మ, మల్లయ్య
భార్య : జమునా రెడ్డి, కూతురు నీత్‌, కొడుకు నితిన్‌
స్వగ్రామం : కమలాపూర్‌, కరీంనగర్‌ జిల్లా
విద్యాభ్యాసం : బీఎస్సీ(బీజెడ్సీ), ఎల్‌ఎల్‌బీ డిస్‌కంటిన్యూ
వ్యాపారం : 1986 నుంచి కోళ్ల పరిశ్రమ వ్యాపారం
చేపట్టిన శాఖ: వైద్య, ఆరోగ్యశాఖ


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్.. మొదటి నుంచీ కేసీఆర్ వెంటే నడుస్తున్నారు. ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో ఉంటూ, అధినేతకు నమ్మినబంటుగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనే కాదు, బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2002లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఆయన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆయనపై ఉన్న నమ్మకంతో బలమైన ప్రత్యర్థి ఉన్న కమలాపూర్ నియోజకవర్గ టికెట్‌ను కేసీఆర్ 2004లో కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో ఉద్దండుడైన ముద్దసాని దామోదర్‌రెడ్డిపై గెలుపొందారు. 2008 ఎన్నికల్లో మెజార్టీని పెంచుకొని మరోసారి ఘనవిజయం సాధించారు. 2009లో ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేశారు. తర్వాత హుజూరాబాద్ నుంచి పోటీ చేసి, గెలుపొందారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో విజయబావుటా ఎగరేశారు. అనంతరం రాష్ట్ర కేబినెట్‌లో రాష్ట్ర తొలి ఆర్థిక, పౌరసరపరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్నింటా అండగా నిలిచారు. ఇటీవలి ఎన్నికల్లోనూ గెలుపొంది, డబుల్ హ్యాట్రిక్ సాధించారు.

ఓటమి ఎరుగని నేతగా ముద్రవేసుకున్నారు. నాటి నుంచి నేటివరకు తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ అధినేత వెంటే నడిచిన ఈటల.. నాడు ఉద్యమ సమయంలో పార్టీకి జిల్లాలో పెద్ద అండగా నిలిచారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. అధినేతకు నమ్మిన బంటుగా ఉన్నారు. అందుకే ఈటలకు 2014 తొలి క్యాబినెట్‌లో అత్యున్నత అర్థిక మంత్రి పదవి ఇచ్చారు. ఆర్థిక, పౌరసరఫరాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన ఆయనకు, మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కింది.

2297
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles