HomeLATEST NEWSerrabelli dayaker rao election campaign in kothaguda mandal

పరిషత్ ఎన్నికలతో కాంగ్రెస్ కనుమరుగు

Published: Mon,April 29, 2019 08:28 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
మహబూబాబాద్ : జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడ మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయమని స్పష్టం చేశారు. కొత్తగూడ, గంగారం మండలాల అభివృద్ధి టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని ఆయన తేల్చిచెప్పారు. పోడు భూముల పరిష్కారం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ర్టాన్ని ఆగం చేసిందన్న ఆయన.. ఆ పార్టీకి ఓటేస్తే మురిగిపోయినట్టే అని దయాకర్‌రావు స్పష్టం చేశారు.
1204
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology