మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల‌పై ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి స‌మీక్ష‌

Wed,May 30, 2018 05:34 PM

Errabelli Dayakar Rao review on Mission Bhagiratha

జ‌న‌గామ: జిల్లాలోని పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో చేప‌ట్టిన‌ మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల తీరుపై ఎమ్మెల్యే ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ఇవాళ స‌మీక్ష‌ చేపట్టారు. పాల‌కుర్తి, దేవ‌రుప్పుల‌, కొడ‌కండ్ల మండలాల్లో జ‌రుగుతున్న మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల పురోగ‌తిపై సంబంధిత ప్ర‌భుత్వ అధికారులు, గుత్తేదారుల‌తో ఎమ్మెల్యే హైదరాబాద్ లోని తన నివాసంలో స‌మీక్ష‌ చేపట్టారు. పనులు న‌త్త‌న‌డ‌క‌న జ‌రుగుతున్నాయ‌ని మిష‌న్ భ‌గీర‌థ అధికారులు, సంబంధిత కాంట్రాక్ట‌ర్‌పై ఎమ్మెల్యే మండిప‌డ్డారు. పనులను వేగవంతం చేసి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు స‌కాలంలో భ‌గీర‌థ ఫ‌లాలు అందించాల‌న్నారు. మ‌రో రెండు నెలల్లో ప‌నుల్లో పూర్తి చేసి, త్రాగు నీటి కోర‌త‌ లేకుండా చూడాల‌ని ఆదేశించారు. రేపు గ్రామాల వారిగా క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌నుల‌పై దేవ‌రుప్పుల‌, కొడ‌కండ్ల‌, పాల‌కుర్తి మండ‌ల కేంద్రాల్లో స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించనున్న‌ట్లు తెలిపారు. అధికారులు, గుత్తేదారులు ఈ సమావేశాలకు హాజ‌రుకావాల‌న్నారు.

1045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles