స్టాంప్ డిజైన్ కాంటెస్ట్ పోటీలకు ఎంట్రీలు ఆహ్వానం

Thu,September 19, 2019 07:00 AM

హైదరాబాద్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టల్ విభాగం నిర్వహి స్తున్న స్టాంప్ డిజైన్ కాంటెస్ట్ పోటీలకు ఈ నెల 20 వరకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ యూనిసెఫ్ సౌజన్యంతో భారత తపాల శాఖ బాలల హక్కులు అన్న అంశంపై విద్యార్థుల నుంచి నూతన స్టాంప్ డిజైన్ లను ఆహ్వానిస్తున్నారు. ఛైల్డ్ రైట్స్‌పై అత్యుత్తమ స్టాంప్ డిజైన్ చేసిన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు , ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు , తృతీ యగా రూ.10 వేల నగదు బహుమతులు ఇవ్వనున్నారు. స్టాంప్ డిజైన్ పోటీలలో 1 నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులు వరకు పాల్గొని, ఏ4 సైజులో వేసిన చిత్రాలను స్పీడ్‌పోస్ట్‌లో పంపించాల్సి ఉంటుంది. ఎంట్రీలను అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఫిలాటెలి) , రూమ్ నంబర్-108 , డాక్ భవన్ , పార్లమెంట్ స్ట్రీట్ , న్యూ ఢిల్లీ , 11001 అడ్రస్‌కు పంపాలని పోస్ట్ ఆఫీసెస్ హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ జి.హైమవతి తెలిపారు. పోటీలలో పాల్గొనదలచిన విద్యార్థులు మరిన్ని వివరాలకు www.indiapost.gov.in లేదా postagestamps.gov.in వెబ్‌సైట్‌లలో సంప్రదించాల్సి ఉంటుంది.

368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles