ఉస్మానియా వర్సిటీలో ఇంగ్లీష్ అధ్యాపకుల జాతీయ సదస్సుWed,September 13, 2017 08:56 PM
ఉస్మానియా వర్సిటీలో ఇంగ్లీష్ అధ్యాపకుల జాతీయ సదస్సు

హైదరాబాద్ : అఖిల భారత ఇంగ్లీష్ అధ్యాపకుల జాతీయ సదస్సును వచ్చే జనవరి 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను వర్సిటీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. నేటి సమాజంలో గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఇంగ్లీష్ అధ్యాపకుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఓయూకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ వచ్చిన తరుణంలో ఇలాంటి సదస్సుల నిర్వహణకు ఓయూసీఐపీ ముందుకురావడం శుభపరిణామమని పేర్కొన్నారు. సదస్సును విజయవంతం చేయాలని ఇంగ్లీష్ అధ్యాపకులకు పిలుపునిచ్చారు.

310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS