నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు

Tue,January 22, 2019 09:47 PM

Engineering student arrested

వరంగల్ : నాటు తుపాకీ కలిగి ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థిని అరెస్టు చేసి అతడి నుంచి తుపాకితోపాటు తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ క్రైం ఆడిషినల్ డీసీపీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆయన కథణం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన గట్టికొప్పుల సచిన్ టెండూల్కర్ రంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదవుతున్నాడు. టెండూల్కర్ కళాశాలకు వెళ్లొస్తున్న క్రమంలో ఆరు నెలల క్రితం సల్మాన్ అనే వ్యక్తి పరిచయమై ఇద్దరు స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో సల్మాన్ నాకు ప్రాణహాని ఉంది.. వరంగల్‌లో నీకు ఎవరైనా తెలిసి ఉంటే తుపాకి కొనుగోలు చేయిస్తే లక్ష రూపాయాలు ఇస్తానని.. ఆశచూపాడు. డబ్బుకు ఆశపడిన సచిన్‌టెండూల్కర్ ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లి రూ.40 వేలకు నాటు తుపాకీ, నాల్గు తుటాలు కొనుగొలు చేసి స్వగ్రామమైన ధర్మారంలో భద్రపరిచి హైదరాబాద్‌కు వెళ్లాడు.

కొద్ది రోజుల క్రితం సచిన్‌టెండూల్కర్ తుపాకీ తీసుకొచ్చిన విషయం సల్మాన్‌కు చెప్పడానికి ప్రయత్నించగా అతడి ఆచూకి లేకుండాపోయింది. ఈ నెల 13న సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన సచిన్‌టెండూల్కర్ తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో ఇంట్లో భద్రపరిచిన తుపాకిని కాలేజ్ బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తున్నాడనే పక్కా సమాచారం మేరకు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్‌రాజ్ బృందం వరంగల్‌లో నిందితుడిని అరెస్ట్ చేసి తుపాకీని, తుటాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా తుపాకీని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభచూపిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు డేవిడ్‌రాజ్, రవిరాజు, గీసుకొండ ఇన్‌స్పెక్టర్ సంజీవరావు, ఎస్సై ఎండీ అబ్ధుల్ రహీమ్‌ను సీపీ రవీందర్ అభినందించారు.

2658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles