ఘనంగా తెలుగు మహాసభల ముగింపు వేడుకలు

Tue,December 19, 2017 06:32 PM

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ముగింపు వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ విశిష్టతను తెలిపే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ముగింపు వేడుకలను వీక్షించేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి భాషాభిమానులు భారీ స్థాయిలో తరలివచ్చారు.
4196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles