ఉద్యోగుల సంఘం లోగో యాప్‌ను ఆవిష్కరించిన ఎంపీ కవిత

Fri,September 14, 2018 06:35 PM

employees union logo app launched by mp kavitha

హైద‌రాబాద్: తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ లోగో, మొబైల్ యాప్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎంపీ కవిత నివాసంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మైనార్టీ ఉద్యోగుల సమస్యలను కవితకు వివరించారు.

ప్రతి జిల్లాలో మైనారిటీ ఉద్యోగుల ఇళ్ళ స్థలాల కోసం 5 ఎకరాల చొప్పున ప్రభుత్వం కేటాయించేలా చూడాలని వారు కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ఏ ఫరూక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఎం. ఏ నయీం, తౌఫీక్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ నయీమొద్దీన్, మొయినొద్దీన్, అబ్దుల్ రవూఫ్ తదితరులు ఎంపీ క‌విత‌ను క‌లిసిన వారిలో ఉన్నారు.


1880
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles