ఉద్యోగుల సమస్యలన్నీ తీరుతాయి: కారం రవీందర్‌రెడ్డి

Tue,October 15, 2019 07:11 AM

హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవో) సెంట్రల్ యూ నియన్ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించగా.. సెంట్రల్ యూనియన్ నేతలు రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎన్నికల అధికారిగా రామినేని శ్రీనివాసరావు వ్యవహరించారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎస్‌ఎం ముజీబ్‌హుస్సేన్ నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యదర్శిగా ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షుడిగా వరదరాజు, ఉపాధ్యక్షులుగా దేవేందర్, విక్రమ్, రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శులుగా ఉమర్‌ఖాన్, నరేశ్‌కుమార్, ఖలీద్ అహ్మద్, సుజాత, కోశాధికారిగా బాలరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మురళీరాజ్, కార్యవర్గసభ్యులుగా ఎంఏ ముజీబ్, వెంకటేశ్, శంకర్, గీత ఎన్నికైనట్టు శ్రీనివాసరావు ప్రకటించారు.

1029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles