హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

Wed,September 5, 2018 04:26 PM

Electric Buses start in hyderabad

హైదరాబాద్ : ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నష్టాలను తగ్గించడంతో పాటు పర్యావరణానికి హానీ కలిగించని ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత ఏసీ బస్సుల మాదిరిగానే ఈ బస్సులను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం 40 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇవ్వగా.. ప్రస్తుతం 5 ఎలక్ట్రిక్ బస్సులో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఐదు బస్సులను సీనియర్ ఐఏఎస్‌లు అజయ్ మిశ్రా, అరవింద్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఒక్కసారి సరిపడినంతా ఛార్జింగ్ పెడితే.. 300 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చు. ఒక కిలోమీటర్‌కు ఒక యూనిట్ చొప్పున కరెంట్ ఖర్చు అవుతుంది.

4802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles