మహబూబాబాద్ పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి

Wed,May 22, 2019 07:17 PM

election counting preparations completed in mahabubabad parliament constituency

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాల చుట్టు భారీ కాంపౌండ్‌తో పాటు లోపల విశాలమైన స్థలం ఉంది. వీటికి తోడు విద్యుత్, టాయిలెట్స్ అన్ని సదుపాయాలు కల్పించారు.

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఇప్పటికే స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ అండ్ కాలేజీ ఫర్ గర్ల్స్, నర్సంపేట, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఎస్ సోషల్ వెల్ఫేర్ స్కూల్, పినపాక, ఇల్లందు నియోజకవర్గాలకు మొదటి అంతస్తు నార్త్ వెస్ట్ రూం న్యూబిల్డింగ్, భద్రాచలం అసెంబ్లీకి టీఎస్ సోషల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గత నెల 11న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు.

పార్లమెంట్ పరిధిలో మొత్తం 14,23,351 ఓట్లు ఉన్నాయి. ఇందులో 9,82,638 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.79 శాతం పోలింగ్ నమోదు అయిన విషయం తెలిసిందే. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏసీలతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతి రౌండ్‌కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

నియోజకవర్గాల వారిగా అత్యధికంగా ములుగు నియోజకవర్గంలో 22 రౌండ్లు కౌంటింగ్ జరుగనుండగా, అత్యల్పంగా భద్రాచలంలో 13 రౌండ్లలోనే కౌంటింగ్ ముగియనుంది. డోర్నకల్-18, మహబూబాబాద్-19, నర్సంపేట-21, పినపాక-17, ఇల్లందు- 18 రౌండ్లలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

1324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles