అన్నీ పక్కాగా ఉంటేనే ప్రచార రథాలకు అనుమతి

Wed,November 21, 2018 06:44 AM

election campaigns vehicles are in que at rta offices

హైదరాబాద్ : డిసెంబర్ 7న పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రచార రథాల హవా కొనసాగుతున్నది. నగరంలోని అన్ని ప్రాంతాల్లోని వీధుల్లో వీటితో ప్రచారం చేస్తూ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రచార రథాల తయారీ ఎక్కువైంది. అయితే ఇవి రోడ్డెక్కాలంటే రవాణాశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉండడంతో పర్మిట్ల కోసం రవాణాశాఖ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నాయి. ఇందులో టీఆర్‌ఎస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, తెలుగుదేశం, ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రచార రథాలు ఉన్నాయి. రవాణాశాఖ అనుమతి పొందే సమయంలో వాహనం ఫిట్‌నెస్, మోడల్‌తోపాటు వాహనానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాహన కండీషన్‌ను పరిశీలిస్తున్నారు. ప్రచార రథానికి వాడే వాహనాన్ని స్వయంగా వెహికల్ ఇన్‌స్పెక్టర్లు నడిపి చెక్ చేస్తున్నారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే అనుమతులు జారీచేస్తున్నారు. పొల్యూషన్ చెకింగ్‌తోపాటు వాహనానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్‌సీ వంటి పత్రాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే ప్రచార రథాల వాహనాలు చాలావరకు పాతవి కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

1290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS