తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

Wed,December 5, 2018 05:29 PM

election campaign stop in Telangana

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. మిగిలింది పోలింగ్ ప్రక్రియనే. ఈ నెల 7వ తేదీన జరిగే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముగించుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన చివరి ప్రచారాన్ని గజ్వేల్ సభలో సా. 4:30 గంటలకు ముగించుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి బహిరంగ సభలు నిర్వహించడం నిషేధం అని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచే ప్రశాంతంగా ఉండాలి. సభలు, ఊరేగింపులు, సినిమా, టీవీల ద్వారా ఎన్నికల సందేశాలు ప్రసారం చేస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, జరిమాన విధిస్తామని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

2952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles