వృద్ధ దంపతుల ఆత్మహత్యTue,November 14, 2017 09:23 PM
వృద్ధ దంపతుల ఆత్మహత్య

రామడుగు : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన వెదిర ముత్తయ్య(95), అతని భార్య లచ్చవ్వ(90) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. వెదిర ముత్తయ్య, లచ్చవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఎవరి కుటుంబ సభ్యులతో వారు వేరుగా ఉంటున్నారు. వయుసు మీదపడి సొంత పనులు చేసుకునేందుకు ఆరోగ్యం సహకరించక పోవడం, మరోవైపు ఇద్దరు కొడుకులు వేరుగా ఉండడంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగారు. ఇద్దరు ఎంతకీ లేవకపోవడంతో పక్కింటివారు తలుపు తెరిచి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నారు. పక్కింటి వ్యక్తి వెదిర లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

1059
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS