తమ్ముళ్ల గెలుపు.. అన్నల ఓటమి..

Tue,December 11, 2018 04:22 PM

elder brothers lost and younger brothers win this elections

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబం నుంచి పోటీ చేసిన రక్త సంబంధీకుల్లో ఒకరు గెలిచారు.. మరొకరు ఓడారు. అలా మూడు కుటుంబాల్లోనూ అదే పరిస్థితి. టీఆర్‌ఎస్ తరపున పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి రేవంత్ రెడ్డిపై గెలుపొందారు. ఇక మల్లు రవి కాంగ్రెస్ నుంచి జడ్చర్ల నియోజకవర్గంలో పోటీ చేసి మంత్రి లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. మల్లు రవి సోదరుడు మల్లు భట్టివిక్రమార్క మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి నల్లగొండలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి గెలుపొందారు.

4516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles