సిబ్బంది తప్పు తేలితే క్రమశిక్షణా చర్యలు...

Mon,April 22, 2019 05:00 PM

Education Secretary Janardhan Reddy explain on inter results

హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఫలితాల్లో ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోందని తెలిపారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీవో ఇచ్చాం. ఏదైనా అవకతవకలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. తప్పుడు మూల్యాంకనం చేసిన సిబ్బందికి రూ.2వేల జరిమానా విధిస్తామన్నారు. తప్పు చేసిన ఉద్యోగి జరిమానా మరింత పెంచే ఆలోచన ఉంది. రీవేరిఫికేషన్‌లో తప్పు తేలితే ఫీజు తిరిగి చెల్లించే అంశం పరిశీలనలో ఉందన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. జీవితంలో ఇంటర్ ముఖ్యం కాదని తెలిపారు.

2562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles