పాఠశాలల అభివృద్ధిపై విద్యాశాఖ దృష్టి

Sun,December 16, 2018 07:38 AM

Education department focus on schools development

హైదరాబాద్: రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ ముగిసిన త ర్వాత బడిబయట ఎంత మంది పిల్లలు ఉన్నారని తెలుసుకోవడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ జిల్లాపరిషత్తు, మండల పరిషత్తు పాఠశాలల్లో ఈ ఏడాది ఎంతమంది విద్యార్థులు చేరారు అన్న విషయాలపై సర్వే చేపట్టనున్నారు. ఈ నెల 18న సర్వేపై డీఈవోలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. అలాగే 21న ఎంఈవోలు, సీఆర్టీలు, యూఆర్‌ఎస్, కేజీబీవీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లతో జిల్లా స్థాయిలో సమావేశాలు, 27న సర్వేతర్వాత తనిఖీలు, జనవరి 7న సర్వే వివరాలను పొందుపరుచడం, జనవరి 11న సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదికను స్టేట్‌ప్రాజెక్టు అధికారులకు అందజేయాలని విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నెట్, గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ సర్వేలో వెల్లడయ్యే అంశాలను వచ్చే విద్యా సంవత్సరంలో పరిగణనలోకి తీసుకోవడం వల్ల అవసరమైన నిర్ణయాలకు అవకాశం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు.

1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles