ఎడ్యుకేషన్ బ్యాక్‌వార్డ్ మండలాలు గుర్తించాం : కడియంMon,July 17, 2017 03:56 PM
ఎడ్యుకేషన్ బ్యాక్‌వార్డ్ మండలాలు గుర్తించాం : కడియం

హైదరాబాద్ : రాష్ట్రంలో 397 కస్తూర్బా పాఠశాలలు పని చేస్తున్నాయని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కొత్త జిల్లాల్లో ఎడ్యుకేషన్ బ్యాక్‌వార్డ్ మండలాలు గుర్తించామని వెల్లడించారు. 391 కేజీబీవీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 7,500 మందికి డ్రెస్ మెటీరియల్ పంపిణీ చేశామని పేర్కొన్నారు. 6, 7, 8 తరగతులకు కేంద్రం నిధులు ఇస్తుందన్న ఆయన.. 9, 10వ తరగతులకు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. కేజీబీవీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీతం పెంచే ప్రతిపాదన ఉందన్నారు.

601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS