ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు

Tue,February 12, 2019 07:37 PM

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి ఈడీ ఆదేశాలు జారీచేసింది. ఇదే కేసులో ఇవాళ కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కీర్తన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ ఆరా తీసింది. వేం నరేందర్ రెడ్డిని ఈడీ అధికారులు ఆరు గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. స్టీఫెన్ సన్ కు ఇస్తామన్న రూ.50 లక్షలతోపాటు మరో రూ.4.5 కోట్ల వ్యవహారంపై ఈడీ అధికారులు విచారించారు.

5184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles