
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దైన నేపథ్యంలో ఈ నెల 11న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ రానున్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. పర్యటన తరువాత ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యసాధ్యాలపై బృందం నివేదిక ఇవ్వనుంది.