త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌: ఈసీ

Mon,April 15, 2019 01:19 PM

EC Nagi Reddy Holds Review Meet With Officials Over mptc and zptc elections

హైదరాబాద్‌: ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నాటికి పోలింగ్‌ స్టేషన్లు సిద్ధం అవుతాయి. పోలింగ్‌ సిబ్బంది నియామకం పూర్తయింది. ఆర్వోలు, ఏఆర్వోల శిక్షణ పూర్తి చేశామన్నారు. ఈ నెల 20వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఈ నెల 18 -20 తేదీల మధ్య నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నాం. నోటిఫికేషన్‌లో అన్ని వివరాలు అందజేస్తాం. నోటిఫికేషన్‌ కాపీలను కూడా అందజేస్తాం. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఓటరు లిస్టులో పేరు కోసం దరఖాస్తు చేసుకున్న అందరి పేర్లు జాబితాలో చేరుస్తామని తెలిపారు.

1261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles