రాత్రి 8.30 గంటల నుంచి గంటపాటు లైట్లు ఆర్పేద్దాం

Sat,March 30, 2019 06:44 AM

earth hour day 2019 Saturday 30 March

హైదరాబాద్ : పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. ధరిత్రిని కాపాడుకుందాం అన్న నినాదంతో ఈ రోజు ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో రాత్రి 8.30 గంటల నుంచి గంటపాటు విద్యుత్ దీపాలను ఆర్పివేసి ఎర్త్‌అవర్‌ను పాటించనున్నట్టు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని పలు ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల వద్ద విద్యుత్ దీపాలను ఆర్పి ధరిత్రిని రక్షిద్దామంటూ ప్రతిజ్ఞలు చేయనున్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై శనివారం రాత్రి 8.30 గంటల నుంచి గంటపాటు ఇండ్లల్లో లైట్లు ఆర్పివేసి సహకరించాలని, మనం జీవించే విధానాల్లో మార్పులు తెద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అంటూ ప్రతిజ్ఞచేయాలని పలు స్వచ్ఛందసంస్థలు సూచిస్తున్నాయి.

4776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles